We thought we will bring out the vintage South Indian flavour this time, by using age-old expressions for age-old traditions...
రెండు శరీరాలు ఒకే ప్రాణముగా జీవించబోతున్న ఇరు మనస్సుల కలయిక ఈ పెళ్లి వేడుక ...
ప్రశాంత్ సారికల కళ్యాణ వైభోగాన్ని చూద్దము రారండి ...
బంతిపూలు, చేమంతులు
గులాబీలు, సన్నజాజులు
ఇలా అన్నింటిని పేర్చారు, అన్నింటిని జతచేర్చారు
జత కాబోయే జంటకు పూలబాట వేసారు
గంధము పూసి, పసుపు రాసి, మంగళ స్నానాలు చేయించి
ప్రశాంత్ సారికల పెళ్లి వేడుకలను ప్రారంభించారు.
సందడి చేస్తూ, సరదా పడుతూ నవ్వుల దీవెనల నడుమ సారిక పెళ్లికూతురాయనే ...
ఆట పట్టిస్తు, ముద్దు చేస్తూ ఆనందాల అక్షింతల జల్లులో ప్రశాంత్ పెళ్లికొడుకాయనే ...
చిరునవ్వుల పలకరింపులు
పిల్లల కేరింతలు
పెద్దల దీవెనలు
బంధువుల కోలాటాల నడుమ
పుత్తడి బొమ్మకి అలంకారాల ఆభరణాలు 
వరుడి మెడలో పూసల దండ నొసట తిలకము
ఇంతటి అందానికి మురిపెంగా బుగ్గన దిష్టిచుక్క 
మెహేంది ముచ్చట్లు, సంగీత్ నృత్యాలు
సరదా కబుర్లు, సందడి దృశ్యాలు
అన్నీ ఆహ్లాదాన్ని నింపుతూ వేడుకల్ని ముందుకు నడిపించాయి

తమ కొత్త మజిలీ ఎప్పుడెప్పుడు మొదలు పెడదామా అని ఎదురుచూస్తున్న ఆ ఇద్దరి కళ్లు... 
వరుడి నుదుటన బాసికం కట్టి
వధువు శ్రవణాల దిద్దులు పెట్టి
పెళ్లి మండపం చేరెను ముచ్చటైన జంట.

చిలిపి ఆలోచనలు, సిగ్గు తెరలు, ముసిముసి నవ్వులు ... మురిసిపోతూ వధూవరులు
తాళాలు, తప్పట్లు, మంగళ వాయిద్యాలు
వేదమంత్రాలు, అగ్ని హోత్రాలు, మనస్ఫూర్తిగా దీవెనలు 
ఇవే సాక్షిగా
 మాయాతెర లేపి, జీలకర్ర బెల్లం పెట్టి, జీవితాంతం ఒకరికొకరం అని కళ్లతోనే మాటిచ్చుకున్నారు
మూడు ముళ్ళు వేసి మురిపెంగా దగ్గరయ్యారు
బ్రహ్మనాశీర్వచణాలను దంపతుల కొంగున ముడివేసి, ఏడడుగులు నడిపించి ఆ బ్రహ్మే బ్రహ్మముడి వేసాడు 
ప్రశాంత్ సారికలు ఒక్కటయ్యారు...
తలంబ్రాలాట, ఉంగరాలాట 
ఎవరు ఓడినా తమ ప్రేమని మాత్రం గెలిపించాలని ఒట్టేసుకున్నారు
అందరి ఆశీస్సులు పొంది
అరుంధతి నక్షత్రం చూపించి
ప్రేమగా తన గుండెలకు హత్తుకొని 
పానిగ్రహణమాడి తన రాణి సారికతో కలిసి ప్రశాంత్ తన ప్రణయ ప్రయాణానికి శ్రీకారం చుట్టాడు...

You may also like

Back to Top